పుత్తూరు పట్టణంలోని ప్రజలకు పాముల బెడద తప్పడం లేదు. మంగళవారం స్థానిక
ఎన్జీవోస్ కాలనీలోని ఓ ఇంట్లోని బెడ్ రూమ్ లో దూరి పాము హల్చల్ చేసిందని స్థానికులు తెలిపారు. వెంటనే స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ కు సమాచారం అందజేయగా ఆయన చాకచక్యంగా పామును పట్టుకొని అడవులలో వదిలేశారు. అలాగే గేట్ పుత్తూరులో రక్త పింజర పామును పట్టి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు స్నేక్ క్యాచర్ తెలిపారు. ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.