పుత్తూరు: గంధపు మహోత్సవంలో పాల్గొన్న రోజా

63చూసినవారు
పుత్తూరు: గంధపు మహోత్సవంలో పాల్గొన్న రోజా
నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని గెట్ పుత్తూరులో శుక్రవారం రాత్రి నిర్వహించిన నాగుర్ ఖాదరవల్లి గంధపు మహోత్సవంలో మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక ముస్లిం పెద్దలు రోజాకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మహిన్, మున్సిపల్ చైర్మన్ హరి, వైస్ ఛైర్మన్ జయప్రకాశ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్