పెద్దపంజాణి మండలంలోని రాయలపేట వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఈ ఘటనలో చంద్రమాకులగడ్డచంద్రమౌళిగడ్డ గ్రామానికి చెందిన చెన్నప్ప తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతడిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారని ఎస్ఐ సహదేవి తెలిపారు.