ఏనుగుల దాడిలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం
పీలేరు మండలంలో ఏనుగుల దాడిలో మృతి చెందిన రాజారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున గురువారం పది లక్షల రూపాయల చెక్కును శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఏనుగులను దారి మళ్లించేందుకు కృషి చేస్తున్నట్లు డి ఎఫ్ ఓ జగన్నాథ్ సింగ్ తెలిపారు.