పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇప్పటికే తేమ కారణంగా మామిడి తోటలలో పూత లేకుండా పోయింది. దీనితో మామిడి పంట సాగు చేసే రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షంతొవర్షంతో మామిడి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది.