పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం దేవలంపేట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మార్గశిర మాసం పంచమి శుక్రవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు పూజలు జరిపారు. స్వామివారికి నైవేద్యం సమర్పించి మహా మంగళహారతి గావించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు అనంత కుమారాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.