సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం అరణ్యం కండిగ పంచాయతీలోని కైలాసకోన ఫెంగల్ తుఫాను వర్షానికి ఆదివారం ఉరకలేస్తూ కనువిందు చేస్తోంది. పుత్తూరు - చెన్నై జాతీయ రహదారిలోని కైలాసకోనకు భారీ వర్షాల కారణంగా పర్యాటకులను అనుమతించడం లేదు. ఎన్నడూ లేని విధంగా కొండపై నుంచి భారీగా నీటి ప్రవాహం వస్తోంది. ఓ పక్క వర్షం కారణంగా కైలాస కోనలో తీవ్ర చలి వాతావరణం నెలకొంది.