ఎమ్మెల్యే ఆదిమూలం చొరవతో తీరిన రోడ్డు సమస్య

81చూసినవారు
ఎమ్మెల్యే ఆదిమూలం చొరవతో తీరిన రోడ్డు సమస్య
తిరుపతి జిల్లా తడ-శ్రీకాళహస్తి రోడ్డు మార్గంలో తడ నుంచి వరదయ్యపాలెం వరకు ప్రమాదకరమైన గుంతలు వల్ల నిత్యం ద్విచక్ర వాహన దారులు ప్రమాదాలకు గురి అయ్యే వారు. ఈ సమస్య ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళింది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చొరవతో శుక్రవారం తాత్కాలిక రోడ్డు మరమ్మతులు చేపట్టారు. రోడ్డు మరమ్మతులు పట్ల వాహనదారులు, ప్రజలు అనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్