తంబళ్లపల్లె: పాము కాటేసి మహిళకు తీవ్ర అస్వస్థత
గొర్రెల దొడ్డిలో శుభ్రం చేస్తుండగా మంగళవారం రాత్రి విష సర్పం కాటేసి మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. తంబళ్లపల్లి మండలం ఎనుకొండోళ్ళ పల్లెకు చెందిన రమణమ్మ (40) గొర్రెల దొడ్డిలో చెత్త తొలగిస్తుండగా ముళ్ళ కంపలో ఉన్న పాము చేతి పైన కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన మహిళను 108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది.