తంబళ్లపల్లి: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కడుపు నొప్పి తాళలేక పురుగు మందు తాగి వ్యక్తి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పెద్ద మండ్యం ఎస్సై రమణ తెలిపారు. పెద్ద మండ్యం మండలం నత్తి ఓబన్న గారి పల్లెకు చెందిన సుబ్రమణ్యం(55) బుధవారం తెల్లవారుజామున కడుపునొప్పి తీవ్రంగా రావడంతో నొప్పి భరించలేక ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు వెంటనే మదనపల్లి ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.