ఉదయగిరి జూనియర్ సివిల్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వహిస్తున్న ఎన్. సుకన్య రాష్ట్ర మంత్రి నారాయణ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా మంత్రి నారాయణ ఆమెకు ప్రశంస పత్రం అందజేశారు.