చీపురుపల్లిలో ఉన్న విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం కృష్ణాష్టమి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలికలందరూ గోపికలు వేషధారణలో బాలురు కృష్ణుని వేషధారణలో రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ పతివాడ జ్యోతి మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మదినము సందర్భంగా కృష్ణాష్టమి జరుపుకుంటామని హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని అన్నారు.