జామి మండలం వెంకటరాజుపాలెం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చుక్క లక్ష్మి అధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర్య దినోత్సవం పై అవగాహన ర్యాలీ ని నిర్వహించారు. అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.