గజపతినగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. ఈ సందర్భంగా మహానుభావుల త్యాగాలను వివరించారు. జడ్పిటిసి గార తౌడు, వైసిపి నాయకులు బెల్లాన త్రినాధరావు, బూడి వెంకటరావు, కర్రి రామునాయుడు, రేగ సురేష్, మండల సురేష్ తదితరులు పాల్గొన్నారు.