వరలక్ష్మిదేవిగా రాజరాజేశ్వరి దేవి

64చూసినవారు
బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలోని రాజరాజేశ్వరిదేవి అమ్మవారు శ్రావణమాసం నిత్య పూజలో భాగంగా రెండవ శుక్రవారం వరలక్ష్మీదేవిగా భక్తుల దివ్య పూజలు అందుకున్నారు. అర్చకులు దూసి శ్రీధర్ శర్మ మహాలక్ష్మిదేవిగా అలంకరించి కదంబ పుష్పములతో లక్ష్మీ సహస్రనామ అర్చన, శ్రీ సూక్తం నారాయణ పంచామృతాభిషేకం, శ్రీ చక్ర కుంకుమార్చన కార్యక్రమాలు జరిపారు. మహిళలు లలితా సహస్ర పారాయణం జరిపారు.

సంబంధిత పోస్ట్