
కురుపాం: ఎంపిడిఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కురుపాం మండలంలో గల ప్రజలు వారి సమస్యలపై కార్యాలయానికి వచ్చి వినతలను అందజేయలని ఎంపీడీవో జె. ఉమామహేశ్వరి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా పరిష్కార వేదికతో పాటు మండలంలో కూడా పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని, మండలంలో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.