ఎస్ కోటలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

70చూసినవారు
ఎస్ కోట మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసిందే. ఒకసారి గా వాతావరణం లో మార్పులు చోటుచేసుకొని ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు సంభవించడంతో ప్రజలు ఒకింత భయాందోళనలకు గురయ్యారు. పలుచోట్ల చెట్లు నెలకొరిగాయి. వేసవి తాపం, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజానీకానికి కురిసిన వర్షం భారీ ఊరటనిచ్చిందని ప్రజలు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్