గోవులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గోకులాలను ప్రోత్సహిస్తుందని ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. శనివారం వేపాడ మండలం సోంపురంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా మంజూరైన మినీ గోకులాలను ప్రారంభించారు. నియోజకవర్గంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వబ్బిన సత్యనారాయణ, ఎంపీడీవో, ఏపీవో పాల్గొన్నారు.