రాక్రీట్ గృహ నిర్మాణాలపై విజిలెన్స్ దర్యాప్తు

72చూసినవారు
రాక్రీట్ గృహ నిర్మాణాలపై విజిలెన్స్ దర్యాప్తు
విజయనగరం మండలంలోని గుంకలాం, కొండకరకాం గ్రామాల్లో జగనన్న హౌసింగ్ కార్యక్రమంలో భాగంగా రాక్రీట్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన గృహ నిర్మాణంపై దర్యాప్తు చేస్తున్నామని శ్రీకాకుళంలోని ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్. పి. ఏ సురేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థకు గుంకలాంలో 5097, కొండకొరకాంలో 958 ఇళ్లు కేటాయించగా ఇప్పటి వరకూ ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయలేదని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్