రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, హెల్మెట్ పెట్టుకొనే వాహనం నడపాలని బొబ్బిలి సీఐ సతీష్ కుమార్, విజయ మోహన్ లు అన్నారు. జాతీయ రోడ్లు భద్రత వార్షికోత్సవంలో భాగంగా పాత బొబ్బిలి కూడలిలో ఆదివారం వాహన చోదుకులకు హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు కూడా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సొంత ఊరు వెళ్లి నేపథ్యంలో హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, శిక్షార్హమన్నారు.