మెరకముడిదాం మండలం ఉత్తరాపల్లి కి చెందిన శ్రీనివాస్ నేదునూరి ఉత్తమ డైరెక్టర్ విభాగంలో విశ్వకర్మ లీడర్ అవార్డును శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మల్లు రవి చేతులమీదుగా అందుకున్నారు. ఈయన దర్శకత్వం వహించిన సంధ్యారాగం సినిమాకు ఈ అవార్డు వరించినట్లు తెలిపారు. శ్రీనివాస్ గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ మేరకు గ్రామస్తులు తమ హర్షం వ్యక్తం చేశారు.