చీపురుపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం
చీపురుపల్లి పట్టణంలో గురువారం పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ 40 మందిని గాయపరిచింది. ఈ మేరకు గాయపడిన క్షతగాత్రులు స్థానికుల సహాయంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య చికిత్స నిమిత్తం వెళ్లారు. పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారికి వైద్యులు అత్యవసర వైద్య చికిత్స చేశారు. కాగా గాయపడిన వారిని స్థానిక వైసీపీ నాయకులు పరామర్శించి మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు కోరారు.