చీపురుపల్లి: డయేరియాతో వృద్ధురాలు మృతి
డయేరియా తో ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన గుర్ల లో శుక్రవారం చోటుచేసుకుంది. పతివాడ సూరమ్మ (70) డయేరియా తో శుక్రవారం మృతి చెందింది. కాగా ఇదే ప్రాంతంలో డయేరియా తో కలిశెట్టి సీతమ్మ మంగళవారం మృతి చెందగా మృతురాలు కుమారుడు కలిశెట్టి రవి (28) తల్లి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురై శుక్రవారం మృతి చెందాడు. గ్రామంలో రోజురోజుకు వరుస మరణాలతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.