దత్తిరాజేరు: ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం

79చూసినవారు
దత్తిరాజేరు: ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం
దత్తిరాజేరు మండలంలోని కోరపు కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. పి.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్ పి.శ్రవంతి, జిల్లా అందత్వ నివారణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రోగులను నేత్ర వైద్యులు ఎల్.ఎల్.ఎన్. మూర్తి పరీక్షలు జరిపారు. 83 మందిని పరీక్షించగా 29 మందిని క్యాటరాక్ట్ శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. హెల్త్ ఎడ్యుకేటర్ డి.వి. గిరిబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్