గంట్యాడ మండలంలోని డీకే పర్తి పంచాయతీ పరిధిలో ఉన్న గిరిజన గ్రామాల్లో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి బోని రామానందం మంగళవారం సందర్శించారు. అధికారులు, సిబ్బందితో కలిసి సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి ఆయా గ్రామాల్లో పర్య టించారు. గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకొని పరిస్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గిరిజన సంఘ నేత అప్పలరాజు పాల్గొన్నారు.