కురుపాం: నిమ్మక జీవన్ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి

71చూసినవారు
జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను శుక్రవారం మంత్రి గుమ్మడి సంధ్యారాణి సందర్శించారు. ముందుగా పాఠశాల సిబ్బందితో మాట్లాడి విద్యార్థి నిమ్మక జీవన్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జీవన్ తండ్రి మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున తమ కుటుంబానికి ఆర్థిక చేయూతనివ్వాలన్నారు. ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్