కురుపాం మండలం గుమ్మ గ్రామంలో ఎస్ఐ నారాయణరావు ఆధ్వర్యంలో మంగళవారం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సైబర్ కేటుగాళ్లు వివిధ రకాలుగా ప్రజల నుంచి డబ్బులు కాజేయాలని చూస్తుంటారని తెలియజేశారు. ఆఫర్లు, గిఫ్ట్లు, ఈజీ మనీ పేరుతో మొబైల్ ఫోన్లకు అనుమానిత లింకులు పంపిస్తారని వాటిని క్లిక్ చేసి వ్యక్తిగత సమాచారం నమోదు చేయకూడదని సూచించారు.