సీఎం చంద్రబాబు గొప్ప విజన్ ఉన్న నాయకులని తన అనుభవాన్ని రంగరించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకు వెళుతున్నారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. విశాఖలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా విశాఖ చేరుకున్న ఆయన పలువురు నాయకులతో కలిసి ఏర్పాట్లలో పాలుపంచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటికి రాష్ట్రం ఖజానా పూర్తిగా ఖాళీ అయిందని అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిందని ఆరోపించారు.