అధ్వానంగా అంతరాష్ట్ర రహదారి

79చూసినవారు
పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే అంతరాష్ట్ర రహదారి అధ్వానంగా ఉండటంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. గత రెండు రోజులుగా వర్షాలు పడటంతో రోడ్డుపై ఉన్న పెద్ద పెద్ద గోతులలో నీరు చేరడంతో రోడ్డు కనపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కొమరాడ ఈశ్వరుని ఆలయం సమీపంలో గుంతలు మరింత ప్రమాదకంగా ఉన్నాయి. భారి వాహనాల రాకపోకలకు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. అధికారులు స్పందించాలని మంగళవారం వాహనదారులు కోరారు.

సంబంధిత పోస్ట్