పార్వతీపురం: సర్వే గ్రామస్తుల సమక్షంలోనే పరిష్కరించండి
మన్యం జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో గ్రామస్తులు, రైతుల భూములకు సంబంధించి ఎటువంటి సర్వే సమస్యలు లేకుండా సాధ్యమైనంత వరకు వారి సమక్షంలోనే పరిష్కరించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తహశీల్థార్లకు, సిబ్బందికి సూచించారు. తద్వారా రైతులకు, గ్రామస్తులకు ఒక భరోసా కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు.