కురుపాం: బస్సు మొరాయించడంతో ప్రయాణికుల అవస్థలు
పార్వతీపురం నుంచి గరుగుబిల్లి మీదుగా గురువారం ఉదయం 9 గంటలకు వంగర చేరుకోవాల్సిన ఆర్టీసీ బస్సు మద్దివలస సమీపంలో మొరాయించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఫ్యాను బెల్టు తెగిపోవడంతో బస్సు ఆగిపోయినట్లు డ్రైవర్ తెలిపారు. స్కూల్ సమయం దాటిపోతుండడంతో ఆటోలు ఇతర వాహనాల్లో విద్యార్థులు పాఠశాలకు వెళ్లిపోయారు. ఈ రూట్లో తిరుగుతున్న పాతకాల బస్సులతో తరచూ ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు వాపోయారు.