రామభద్రపురం: ప్రభుత్వాసుపత్రులపై విశ్వాసం కలిగేలా విధులు నిర్వహించాలి

56చూసినవారు
రామభద్రపురం: ప్రభుత్వాసుపత్రులపై విశ్వాసం కలిగేలా విధులు నిర్వహించాలి
ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు విశ్వాసం కలిగేలా వైద్య సిబ్బంది విధులు బాధ్యతగా నిర్వహించాలని డీఎంహెచ్వో జీవన రాణి ఆదేశించారు. మంగళవారం ఆరికతోట, రామభద్రపురం పిహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో పలు రికార్డులు, రిజిస్టర్లు, సిబ్బంది హాజరు పట్టికలు, ఆన్ లైన్ హాజరును పరిశీలించారు. ఆసుపత్రి ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతీ నెల ఎన్నెన్ని ప్రసవాలు జరుగుతున్నాయో పరిశీలించారు.

సంబంధిత పోస్ట్