వీరఘట్టం: ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం

57చూసినవారు
వీరఘట్టం మండలం సంత - నర్సిపురం లో గురువారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన చింత రామకృష్ణ(58) అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన బందలుప్పి కిరణ్ దారుణంగా కొట్టి చంపాడు. దీనిపై మృతుడు భార్య ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకున్న పాలకొండ సీఐ చంద్రమౌళి మాట్లాడుతూ ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్