స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాన్ని వైద్యశాఖ మన్యం జిల్లా ప్రోగ్రాం అధికారి డా. టి. జగన్ మోహనరావు, జిల్లా మలేరియా అధికారి వై. మణి సిబ్బందితో కలిసి పార్వతీపురం ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో శనివారం చేపట్టారు. పరిసరాల్లో ఉన్న వ్యర్థ పదార్థాలు, చెత్తాచెదారం నుచెత్తచెదారాన్ని ఊడ్చి తొలగించి ఆవరణను శుభ్రం చేశారు. సేకరించిన చెత్తను వెను వెంటనే దహనం చేశారు.