పార్వతీపురం: యువత క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్యే విజయచంద్ర

57చూసినవారు
పార్వతీపురం: యువత క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్యే విజయచంద్ర
యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ క్రీడలను స్ఫూర్తిగా తీసుకోవాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ లో ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, సెటిల్ బ్యాడ్మింటన్ తోపాటు పలు క్రీడల్లో పాల్గొన్నారు. యువత క్రీడల్లోనూ, చదువులోనూ రాణించాలన్నారు.

సంబంధిత పోస్ట్