స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి శనివారం శ్రీకారం చుట్టారు. ప్రతి మూడవ శనివారం "స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు పిలుపు మేరకు శనివారం సాలూరు మున్సిపాలిటీలో మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి చీపురు పట్టి రహదారులను శుభ్రం చేశారు. స్ఫూర్తి పొందిన ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని చీపుర్లు పట్టి శుభ్రత చేపట్టారు.