పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రి ఎదురుగా నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే విజయ్ చంద్ర పరిశీలించారు. మంగళవారం పనుల పురోగతి పై ఆరా తీశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని నాణ్యతలో రాజీలేదని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా కేంద్రంలో వైద్యశాల మెరుగుకు పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపుతున్నామని ఎమ్మెల్యే అన్నారు.