ఉపాధి హామీ చట్టం ప్రకారం గ్రామసభల ద్వారా మంజూరైన ఉపాధి హామీ పనుల చెల్లింపులు గ్రామ సర్పంచ్ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని పలువురు ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. శుక్రవారం పాచిపంట మండల పరిషత్ కార్యాలయం వద్ద సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైసిపి నాయకులు ఆందోళన చేశారు. నిబంధనల ప్రకారం సర్పంచుల ప్రాధాన్యత మేరకు గ్రామాల్లో పనులు మంజూరు చేయాలని, పనుల అనంతరం బిల్లులు సర్పంచుల ఖాతాలో జమ చేయాలని తెలిపారు.