పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో ఉమామహేశ్వరరావు అనే వ్యక్తిని గాయపరిచి, అతని వద్ద ఉన్న సెల్ఫోన్, నగదు మరికొందరి దగ్గర నగదు, సెల్ఫోన్లను దొంగలించిన కేసులో ఇద్దరు నిందితులను రిమాండుకు తరలించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న జరిగిన దాడి, దోపిడీ కేసులో ఉను కూరు జోసెఫ్, మోసూరు శివలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు.