భీమిలి నియోజకవర్గం సంగివలసలో శనివారం లక్ష్మీ విజయ మెడికేర్ హాస్పిటల్ వద్ద, జిల్లా అందత్వ నివారణ సంస్థ విశాఖపట్నం వారి సహకారంతో గంటా శారదమ్మ హెల్పింగ్ హాండ్స్ మరియు వెంపాడ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కంటి శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో 105 మంది కంటి రోగులను పరీక్షించారు. అందులో 39 మందికి కంటి ఆపరేషన్ అవసరమని గుర్తించి, శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి పంపించారు.