గాజువాక నియోజకవర్గం 71 వ వార్డులో దుర్గాదేవి ఆలయం 15వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు పలువులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు.
పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను కమిటీ సభ్యులు సత్కరించారు.