కోడిపందెం రాయుళ్ళు అరెస్ట్

78చూసినవారు
కోడిపందెం రాయుళ్ళు అరెస్ట్
కోడిపందేలు ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట గ్రామంలోని పలువురు కోడిపందేలు ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో తన సిబ్బందితో కలిసి ఎస్ఐ ఈశ్వరరావు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఐదుగురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక కోడిపుంజు, రూ. 1350 నగదు స్వాధినం చేసుకోని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్