ఈనెల 27 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒత్తిడి, భయం తగ్గించుకుని ఆత్మ ధైర్యంతో పరీక్షలు రాస్తే, విజయం తప్పకవరిస్తుందని మన్యపుత్ర యువజన సంఘ అధ్యక్షుడు మడపల సోమేష్ కుమార్ (ఉప సర్పంచ్)సూచించారు. సోమవారం రింతాడ బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనుమతి మేరకు పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలలో ఎలా ఉత్తీర్ణులు కావాలో మెళుకువలను సూచిస్తూ, ఒత్తిడి, భయం ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుచుకుని పరీక్షలు బాగా రాయాలని మోటివేషన్ క్లాస్ ద్వారా ప్రేరణ కల్పించారు.
తదనంతరం మన్యపుత్ర యువజన సంఘ సభ్యుల ఆర్థిక సహాయంతో పదో తరగతి విద్యార్థులకు స్కేలు,పెన్నులు సోమేష్, రామరాజు పంపిణీ చేశారు. ఉన్నత చదువులు చదువుకొని, ఉప సర్పంచ్ విధులు నిర్వర్తిస్తూ గ్రామంలో అనేక మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ, మా పాఠశాల విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తిని కల్పిస్తున్న యువజన సంఘ అధ్యక్షుడు సోమేష్, రామరాజు (పీహెచ్డీ స్కాలర్) పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, పాఠశాల సిబ్బంది అభినందిస్తూ, ఆనందం వ్యక్తం చేశారు.