స్త్రీలకు ఆస్తిలో హక్కు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్

1239చూసినవారు
స్త్రీలకు ఆస్తిలో హక్కు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండల కేంద్రంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఆదివారం తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మత్స్యరాస మణి కుమారి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే తెలుగు జనుల ఆరాధ్య నాయకుడు ఎన్టీఆర్ తెలుగు బాష గొప్పతనం దేశ విదేశాలకు సాటి చెప్పిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ అన్నారు. తెలుగు సిని రంగంలో చెరిగిపోని చిరునామా ఎన్టీఆర్ అని మత్స్యరాస మణి కుమారి అన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాతే ఆంధ్రప్రదేశ్ లో పేదవాడికి న్యాయ పాలన అందింది అన్నారు. సామాన్యలకు రాజకీయ రంగంలో నాయకులుగా ఎదగటానికి కారణం ఎన్టీఆర్ అని అన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలకు ఆస్తి లో సమాన హక్కు కల్పించి స్త్రీల పాలిత పెద్ద అన్నల ఎన్టీఆర్ నిలిచారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్