విశాఖ జిల్లాలో మంత్రులు వీరేనా..?

3279చూసినవారు
విశాఖ జిల్లాలో మంత్రులు వీరేనా..?
ఏపీలో రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా ఎవరెవరుంటారనే దానిపై ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఈసారి కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రి పదవులు కోరుకుంటున్న వారి జాబితా భారీగానే ఉంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుండి గెలుపొందిన గంటా శ్రీనివాసరావు (తెలుగు దేశం)- మానవ వనరుల శాఖ, విద్యా శాఖ (ప్రాథమిక, మాధ్యమిక. సాంకేతిక), చింతకాయల అయ్యన్న పాత్రుడు (తెలుగు దేశం)- కార్మిక శాఖ, మత్స్య శాఖ & పాడి పంటలు, వంగలపూడి అనిత ( తెలుగు దేశం)- హోంశాఖ, విపత్తు నిర్వహణ. కొణతాల రామకృష్ణ (జనసేన) - న్యాయ శాఖ, విద్యుత్ శాఖ మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్