అనంతగిరి మండలంలోని సిపిఎం పార్టీ కార్యదర్శిగా టోకూరు సర్పంచ్ కిల్లో. మోస్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం అనంతగిరి మండలంలోని సిపిఎం నేతలు దేవన్న దేముడుమ్మ అధ్యక్షతన జరిగిన మండల మహ సభలో జిల్లా కార్యదర్శి అప్పలనర్స ఆధ్వర్యంలో 11 మందితో ఎన్నిక జరిగింది. సర్పంచ్ మోస్య కార్యదర్శిగా, నాగులు దేవన్న దేముడమ్మ కాగా కొండలరావు, వెంకటరమణ, బుద్రయ్య, గంగులు, క్రీష్ణ, కాసులమ్మ తదితరులు సభ్యులుగా ఎన్నికయ్యారు.