హుకుంపేట మండలంలోని రంగశీల పంచాయతీలో మంగళవారం పెసా కమిటీ ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షులుగా ఉమామహేశ్వరిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా కార్యదర్శిగా దనేశ్వరరావుని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరి మాట్లాడుతూ.. ప్రకృతి పరంగా లభ్యమైన సహజ సంపదను సంరక్షించుకోవడమే పెసా కమిటీ లక్ష్యమన్నారు. రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులు చట్టాల పరిరక్షణ కోసం కృషి చేస్తామని తెలిపారు. ఉప సర్పంచ్ దాసుబాబు తదితరులున్నారు.