గుండె, కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆనందపురం మండలంలో రేగానిగూడెం గ్రామానికి చెందిన రేగాని రామన్నకు మహాలక్ష్మి కల్చరల్ అసోసియేషన్ అధినేత ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ మంగళవారం రూ. 50వేలు ఆర్థికసాయం అందజేశారు. సీఫుడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రామన్నకు ఇటీవల గుండె, కిడ్నీలకు రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతినడంతో విజయనగరం శ్రీరామమూర్తి ఆసుపత్రిలో చేరాడు. తనవంతుగా రూ. 50వేలు ఆర్థికసాయాన్నిచంద్రబోస్ ఇచ్చారు.