రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని కళాశాలల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే రమణాజి మంగళవారం సాయంత్రం తెలిపారు. ఈనెల 21వ తేదీన ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు విన్నవించడం జరిగిందన్నారు. అలాగే ఉత్తరాంధ్రలో గల ముఖ్యమైన డిగ్రీ కళాశాల నుంచి 45 లక్షల 25 వేల రూపాయలు సమకూర్ సీఎంకి చెక్కు రూపంలో అందించమన్నారు.