రాష్ట్ర ఎక్సైజ్, గనులశాఖ మంత్రి, అనకాపల్లి జిల్లా ఇంఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర ఈనెల 22న చోడవరం మండలంలో పర్యటించనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా గంధవరం గ్రామంలో గల విత్తన పరిశోధన అభివృద్ధి కేంద్రం సందర్శిస్థారనీ, తదుపరి గోవాడలో గల చక్కెర కర్మాగారాన్ని పరిశీలిస్తారన్నారు. అనంతరం చోడవరం తహసిల్దార్ ఆఫీస్ కార్యాలయ భవనము పరిశీలిస్తారన్నారు.